అందాల ఆరబోతతో సెగలు.. ప్రియా వారియర్ క్లీవేజ్ షో రచ్చ!

ప్రియా ప్రకాష్ వారియర్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఒక్క కన్నుగీటుతో దేశాన్ని ఊపేసింది. ముద్దుగన్ను పేల్చి కుర్ర హృదయాల్ని కాల్చేసింది. ఒరు అదార్ లవ్ సినిమా విడుదలకు ముందే ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఊహించని క్రేజ్ రావడంతో ప్రియా వారియర్ రేంజ్ కూడా మారిపోయింది. ప్రియా వారియర్ కోసం సినిమా స్క్రిప్ట్‌నే మార్చేశారంటే ఆమె రేంజ్ ఏ లెవెల్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

Priya Prakash Varrier Latest Pics Goes Viral
Priya Prakash Varrier Latest Pics Goes Viral

అయితే ఈ క్రేజ్ అంతా సినిమా విడుదల కాకముందు వరకే ఉంది. మూవీ విడుదలయ్యాక ప్రియా వారియర్‌కు ఉన్న క్రేజ్ మొత్తం పోయింది. అప్పటి వరకు ఆఫర్లు ఇచ్చిన నిర్మాతలు కూడా వెనక్కి వెళ్లిపోయారు. రెమ్యూనరేషన్ విషయంలో అప్పటి వరకు బెట్టు చేసిన ప్రియా.. దెబ్బకు వెనక్కి తగ్గింది. తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మకు ఒకప్పుడు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. అలా పోయిన క్రేజ్‌ను సోషల్ మీడియా ద్వారా తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

సోషల్ మీడియాలో ప్రియా ప్రకాష్ వారియర్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లకు హీటెక్కిస్తుంటుంది. అలా అందాలను ఆరబోస్తూ తనకు ఇప్పుడున్న కొద్దిపాటి క్రేజ్‌ను కాపాడుకుంటోంది. తాజాగా ఆమె క్లీవేజ్ షోతో అందాలను ప్రదర్శిస్తూ రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రియా వారియర్ తెలుగులో నితిన్ సరసన నటిస్తోంది. చెక్ సినిమాలో ప్రియా ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.