Prabhas – Prithviraj: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులే చేస్తూ, సలార్, కల్కి 2898 AD లాంటి బ్లాక్‌బస్టర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజి సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్, తర్వాత సలార్ 2, కల్కి 2 షూటింగ్‌లను స్టార్ట్ చేయనున్నాడు.
ఇదిలా ఉంటే, ఇటీవల సలార్ సినిమాలో విలన్‌గా మెప్పించిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, సలార్ 2 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సలార్ 2 కథ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పాడు. ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యాక, సలార్ 2 సెట్స్‌పైకి వెళ్తుందని ఈ మలయాళ స్టార్ స్పష్టం చేశాడు.
అంతేకాదు, ప్రభాస్ గురించి మాట్లాడుతూ, సలార్ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రభాస్‌తో చాలా క్లోజ్ అయ్యానని చెప్పాడు. ప్రభాస్ అసలు తన స్టార్‌డమ్‌ను పెద్దగా పట్టించుకునే వ్యక్తి కాదని, ఆ విషయం గురించి అతనికి సరిగ్గా తెలియదని.. సోషల్ మీడియా కూడా వాడడని పృథ్వీరాజ్ కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ పూర్తిగా ప్రైవేట్ పర్సన్ అని, అతనికి అత్యంత సన్నిహితులవద్ద మాత్రమే వ్యక్తిగత విషయాలు చెప్పే అలవాటు ఉందని వెల్లడించాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే, పృథ్వీరాజ్ ప్రస్తుతం తన కొత్త సినిమా L2: Empuraan ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మార్చి 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ప్రమోషన్ సందర్భంగా, రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో తాను కీలక పాత్ర పోషించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయని, అయితే దీనిపై రాజమౌళి అధికారికంగా ప్రకటించాకే క్లారిటీ వస్తుందని చెప్పాడు. ప్రస్తుతం సలార్ 2 అప్‌డేట్‌పై ఆసక్తి పెరుగుతుండగా, ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మరో ప్యాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ రాబోతుందనే హైప్ మరింత పెరిగింది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.