మేకప్‌ తీసేసి రమ్మన్న మణిరత్నం సార్‌: ప్రీతిజింటా

బాలీవుడ్‌ నటులు షారుఖ్‌ ఖాన్‌, మనీషా కొయిరాలా, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘దిల్‌ సే’. ఈ సినిమాకు కోలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాతోనే ప్రీతి జింటా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా విషయాలను గుర్తు చేసుకుంటూ.. 26 ఏళ్ల తర్వాత ఒక స్పెషల్‌ పోస్ట్‌ పెట్టింది. ఈ ఫొటోను ‘దిల్‌ సే’ మూవీ సెట్‌లో మొదటి రోజు తీశారు.

ఈ సినిమాలో అవకాశం రాగానే మణిరత్నం సర్‌, షారుఖ్‌ ఖాన్‌లతో పని చేయడానికి ఆత్రుతగా ఎదురు చూశా. మణి సార్‌ నన్ను ఫస్ట్‌ చూడగానే నా దగ్గరకి వచ్చి ముఖం కడుక్కొని రమ్మని నవ్వుతూ చెప్పారు. అయితే నేను జోక్‌ చేస్తున్నారనుకున్నా. సార్‌.. నా మేకప్‌ పోతుంది అన్నాను.

నాకు కూడా కావలసింది అదే.. దయచేసి విూ ముఖం కడుక్కోండి అన్నాడు. దీంతో మేకప్‌ తీసేశాను. ఆ తర్వాత తీసిన క్లోజప్‌ షాట్‌ అద్భుతంగా వచ్చింది. ఈ ఫొటో నా తొలి సన్నివేశంలోనిది. ఇంత అందమైన ఫొటో తీసిన మా ఫొటోగ్రఫీ డైరెక్టర్‌ సంతోష్‌ శివన్‌కు ధన్యవాదాలు అంటూ ప్రీతి జింటా రాసుకోచ్చింది. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది.