అంచనా : వరల్డ్ వైడ్ “ఆదిపురుష్” డే 1 వసూళ్లు.!

చాలా కాలం తర్వాత మళ్ళీ పాన్ ఇండియా సినిమా కళకళలాడే రోజు అయితే వచ్చింది. ఈ ఏడాది జనవరిలో అయితే వచ్చిన మొదటి బిగెస్ట్ చిత్రం “పఠాన్” హిందీలో భారీ వసూళ్లు అందుకుంది. అలాగే తెలుగు సహా తమిళ్ లో కూడా మంచి వసూళ్లే రాబట్టింది కానీ హిందీ మరియు తెలుగులో కూడా సమాన ఓపెనింగ్స్ అందుకునే సినిమా అయితే ఈ ఏడాదిలో ఇంకాఆ రానే లేదు.

మరి ఆ తరహా ఓపెనింగ్స్ ఇచ్చే సినిమాలా మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన భారీ చిత్రమే “ఆదిపురుష్”. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ బుకింగ్స్ ని నమోదు చేసిన ట్రేడ్ వర్గాలకి షాకిచ్చింది. ఇక దీనితో ఈ సినిమా మొదటి రోజు రికార్డు వసూళ్లు రిజిస్టర్ చేస్తుంది ని ట్రేడ్ వర్గాలు ఆల్రెడీ ఒక అంచనా ఐతే వేస్తున్నారు.

మరి అలా లేటెస్ట్ గా ట్రేడ్ అంచనాతో అయితే ఆదిపురుష్ డే 1 కి వరల్డ్ వైడ్ గా ఏకంగా 100 నుంచి 120 కోట్ల మధ్య గ్రాస్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీనితో అయితే ప్రభాస్ కెరీర్ లో మరో 100 కోట్ల ఓపెనర్ సినిమా పడినట్టే అని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఇది అంచనా మాత్రమే కాగా రేపటికి అయితే అసలు లెక్కలు తెలుస్తాయని చెప్పాలి. మరి ఈ సినిమాలో కృతి సనన్, సైఫ్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.