హనుమాన్ కి నో టెన్షన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఆదిపురుష్ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే మెజారిటీ ప్రేక్షకులు రామాయణం కథని పూర్తిగా వక్రీకరించారు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నార్త్ ఇండియాలో అయితే ఏకంగా నిరసనలు కూడా మొదలెట్టారు. ఆదిపురుష్ సినిమాని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. లేదంటే కించపరిచే విధంగా ఉన్న డైలాగ్స్, సన్నివేశాలు వెంటనే మార్చాలని కోరుతున్నారు.

ఇక దేశ వ్యాప్తంగా హిందుత్వ సంఘాల ఆగ్రహం, రాజకీయ పార్టీల హెచ్చరికల నేపథ్యంలో చిత్ర యూనిట్ కూడా వెనక్కి తగ్గి ఆదిపురుష్ డైలాగ్స్ లో మార్పులు చేయడానికి అంగీకరించింది. వారం రోజుల్లో సంభాషణలు మారుస్తామని చెప్పారు. భారీ హైప్, ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీపై ఓ విధంగా ప్రజాగ్రహం వ్యక్తం అవుతుందనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా లెవల్ లో హను మాన్ టైటిల్ తో సూపర్ హీరో మూవీ చేస్తున్నాడు. ఇందులో హనుమంతుడి పాత్ర ప్రధానంగా కథ ఉండబోతోంది. అయితే ఈ చిత్రానికి అలాంటి ఆటంకాలు ఎదురయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో హనుమాన్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చాడు.

తాను చిన్నప్పటి నుంచి హనుమాన్ లో ఎలా అయితే చూసానో అలాగే సినిమాలో చూపించానని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేస్తోన్న హనుమాన్ చేస్తోన్న మూవీ కథాంశం ప్రస్తుత నేపథ్యంలోనే నడవనుంది. ప్రస్తుతం సమాజంలో హనుమాన్ ని ఎలా స్పూర్తిగా తీసుకోవాలి అనే పాయింట్ ని ప్రశాంత్ వర్మ టచ్ చేస్తున్నారు. వర్తమానంలో లో ఉండే సూపర్ హీరో కథగానే దీనిని డిజైన్ చేస్తున్నారు.

నిజానికి ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాని కారణంగా లేట్ అవుతూ వస్తోంది. అలాగే ఆదిపురుష్ మూవీ రిలీజ్ తర్వాత ప్రేక్షకులకి అందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అయితే ఎనౌన్స్ చేయలేదు. ఆదిపురుష్ మూవీ ప్రేక్షకుల ముందుకి రావడంతో ఇప్పుడు హనుమాన్ డేట్ ఫిక్స్ చేయడానికి ప్రశాంత్ వర్మ భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి, మైథలాజికల్ టచ్ కచ్చితంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.