“సలార్” ఫస్ట్ సింగిల్..మళ్ళీ కొట్టేసేలా ఉన్న ప్రశాంత్ నీల్ 

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో ఆడియెన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చేస్తున్న మొదటి చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఇప్పుడు అవైటింగ్ గా ఉన్న మొదటి సాంగ్ ని అయితే రిలీజ్ చేశారు.

సంగీత దర్శకుడు రవి బాసృర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ చూసాక విన్నాక మాత్రం మళ్ళీ ప్రశాంత్ నీల్ ఆడియెన్స్ ని డెఫినెట్ గా కనెక్ట్ చేసేలా ఉన్నాడని చెప్పాలి. హీరో ప్రభాస్ నటుడు పృథ్వీ రాజ్ ల మధ్య స్నేహాన్ని చెప్తూ కంపోజ్ చేసిన ఈ సాంగ్ వినడానికి చాలా ఇంప్రెసివ్ గా ఉంది.

అలాగే ఇందులో ఎమోషన్ బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పక తప్పదు. గతంలో కేజీఎఫ్ కి అమ్మ పాటలతో ఎమోషన్స్ తో ఎలాగైతే ప్రశాంత్ నీల్ కదిలించాడో ఈసారి మాత్రం స్నేహ బంధంతో అందరినీ కదిలించేలా ఉన్నాడని చెప్పాల్సిందే. ఇక ప్రభాస్ మరియు పృథ్వీ రాజ్ మధ్య ఎమోషనల్ బాండింగ్ వారి మధ్య సన్నివేశాలు చూసేందుకు చాలా బాగున్నాయి.

వీటితో మాత్రం సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పడంలో సందేహం లేదు. మరి బిగ్ స్క్రీన్స్ పై మాత్రం ఈ ఎమోషన్స్ అంతా వర్కౌట్ అయ్యేలానే అనిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో శృతి హాసన్, జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఈ డిసెంబర్ 22మా గ్రాండ్ గా సినిమా రిలీజ్ కాబోతుంది. 
Sooreede (Telugu) - Salaar |Prabhas | Prithviraj | Prashanth Neel | Ravi Basrur | Hombale Films