వైరల్ : ఓంరౌత్ కి కౌంటరేసిన ప్రశాంత్ నీల్.?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్న ఆల్ మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లు అన్నిటిలో కూడా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రెజెన్స్ తప్పకుండా ఉంటుంది. అటు హిందీ ఇటు తెలుగులో కూడా భారీ స్థాయి మార్కెట్ ని ఏర్పరుచుకున్న ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న దర్శకులు అలాగే నిర్మాతలు ఎంతో బడ్జెట్ పెడుతున్నారు.

అయితే వాటిలో లేటెస్ట్ గా దర్శకుడు ఓంరౌత్ తో తెరకెక్కించిన భారీ విజువల్ సినిమా “ఆదిపురుష్” చిత్రం ఊహించని రీతిలో మిస్ ఫైర్ అయ్యింది. కాగా ఆదిపురుష్ చిత్రానికి 600 కోట్లకి పైగానే బడ్జెట్ పెట్టమని నిర్మాతలు చెప్పారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో బిగ్గెస్ట్ ఏక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న “సలార్” దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన పలు కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

అయితే ఈ స్టేట్మెంట్ లేటెస్ట్ గా ఇచ్చిందా లేక పాతదా అనేది తెలియాలి కానీ కౌంటర్ మాత్రం సరిగ్గా ఓంరౌత్ కే పడినట్టు అనిపిస్తుంది. ఇంతకు నీల్ ఏమన్నాడంటే.. కొందరు గ్రాఫిక్స్ అంటూ ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తున్నారు మేము తక్కువ బడ్జెట్ పెట్టి మంచి విజువల్స్ తీస్తున్నాం తొందర్లో మీరే చూస్తారు”.

అంటూ కామెంట్స్ చేసాడు. దీనితో ఈ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుండగా ప్రశాంత్ నీల్ అయితే తన హీరో ప్రభాస్ ని పెట్టి ఓంరౌత్ విజువల్ వండర్ అంటూ చేసిన ఆదిపురుష్ పైనే కౌంటర్ వేసాడని ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి అయితే ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.