Anchor Pradeep: తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర మీద సందడి చేస్తున్న అతి తక్కువ మంది మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా ఒకరు. ప్రదీప్ ప్ త న టైమింగ్ తో కామెడీ పంచ్ లతో ఎక్కడ ఉంటే అక్కడ సందడి చేస్తాడు. ఇక బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో సుమ ప్రథమస్థానంలో ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. శుభ మాట్లాడటం మొదలుపెడితే మిగిలినవారు అందరూ చెవులకు మాత్రమే పని పెట్టాల్సి ఉంటుంది. అలాంటిది వీరిద్దరూ ఒకచోట చేరారు అంటే ఏ రేంజ్ లో సందడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరు యాంకరింగ్ మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ నటులుగా మంచి గుర్తింపు పొందారు.
ప్రదీప్ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమాలో హీరోగా నటించగా.. ప్రస్తుతం శివ ప్రేమ పంచాయతీ అనే సినిమాలో ప్రధానపాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రోజున గ్రాండ్ గా జరిగింది. ఈ రిలీజ్ ఈవెంట్ లో సుమ కొంచెం సీరియస్ గా ఉంది. అందుకు కారణం తను పిలిచిన గెస్ట్ లందరూ రాకపోవడమే. జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుధీర్, ప్రదీప్ కూడా సందడి చేశారు. వీరిద్దరితో సుమ కి మంచి అనుబంధం ఉంది. వీరందరూ ఒకరి కోసం ఒకరు ఎప్పుడు సహాయం చేసుకుంటూ ఉంటారు. అందువల్ల సుమ యూ ట్యూబ్ చానెల్ కోసం సుధీర్, ప్రదీప్ ఇద్దరు సహాయం చేశారు.
అలాగే జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా సుమ వీరిద్దరిని ఇన్వైట్ చేసింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ కొంచం సీరియస్ గా ఉంది. ఆ సమయంలోనే ప్రదీప్ ఎంట్రీ ఇవ్వటంతో సుమ లేచి ప్రదీప్ దగ్గరికీ వచ్చి అతని చెవిలో ఏదో చెప్పింది. వెంటనే ప్రదీప్ సుమ కి ఎదురుగా నిలబడి ముందుకు వంగి సుమ కాళ్లు పట్టుకున్నట్టు బిల్డ్ అప్ ఇచ్చి తన షూ లేస్ కట్టుకున్నాడు. ప్రదీప్ అందరి ముందు ఇలా కాళ్లు పట్టుకుంటున్నట్టు బిల్డప్ ఇచ్చి సుమతో పరాచకాలు ఆడాడు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.