Prabhas : రాధే శ్యామ్ అభిమానులకు నచ్చకపోవడానికి అదే కారణం అయ్యుండొచ్చు… ప్రభాస్…!

Prabhas : బాహుబలి క్రేజ్ తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు నిరాశపరిచాయి. దీనికి కారణం ముఖ్యంగా ప్రభాస్ నుండి ఆయన అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవడమే. ఇమేజ్ చట్రంలో ప్రస్తుతం ప్రభాస్ ఇరుక్కుపోయాడు. ప్రభాస్ ఈ ఇమేజ్ చట్రం నుండి బయటపడి తనకు నచ్చిన పాత్రలు చేయాలనుకుంటున్నాడు. కానీ అభిమానులు మాత్రం అందుకు సిద్ధంగా లేరు.

సాహో సినిమా బాలీవుడ్ లో పర్వాలేదనిపించిన రాధే శ్యామ్ మాత్రం బాగా నిరాశ పరిచింది. ఇక సినిమాలో ప్రభాస్ యాక్షన్ హీరోగా కాకుండా ఒక ప్రేమికుడిగా కనిపించడాన్ని ఆయన అభిమానులు అంగీకరించలేదు. అయితే ప్రభాస్ కూడా సినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలను వివరించారు. సినిమా కరోనా వ్యాప్తి ఇంకా తగ్గక పోవడమే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అని అనుకుంటున్నారు ప్రభాస్.

అంతేకాకుండా తనని ప్రేమికుడి క్యారెక్టర్ లో ప్రేక్షకులు ఉహించుకోలేక పోయారని, అలాగే స్క్రిప్ట్ లో కూడా ఏదైనా తప్పు ఉండొచ్చని ప్రభాస్ వెల్లడించారు. ఇక ప్రభాస్ వరుస సినిమాల విషయానికి వస్తే ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లాంటి సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. వీటితో పాటుగా మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇపుడు ప్రభాస్ చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.