ప్రభాస్, యష్ కాంబో.. కొంచెం చూడండి బయ్యా

బాహుబలితో సెట్ చేసిన ఒక బిగ్గెస్ట్ రికార్డుతో ప్రభాస్ పాన్ ఇండియా అనే దారిని మరింత పెద్దది చేయగా KGF చాప్టర్ 1తో యష్ కూడా మరో దారిని సెట్ చేశాడు. ఇటీవల చాప్టర్ 2 టీజర్ క్లిక్కవ్వడంతో బాహుబలి 2 రేంజ్ లో ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి. ప్రభాస్, యష్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకుంటున్నారు.

Yash | Telugu Rajyam
ఇక ఈ హీరోలిద్దరు కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఇటీవల వైరల్ అయిన ఫొటోలతో చాలా క్లారిటీగా అర్థమయ్యింది. ఇటీవల సలార్ సినిమాకు సంబంధించిన లాంచ్ ఈవెంట్ లో యష్ స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్, యష్ అలా పక్కపక్కనే కనిపించడంతో అభిమానుల ఆనందం డోస్ ఆకాశం అంచులను దాటేసింది. అయితే ఈ హీరోలు ఫొటోలో కనిపిస్తేనే ఇలా ఉందంటే ఇక కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది?

ఇప్పుడు ప్రభాస్, యష్ అభిమానుల మనసులో అదే మెదులుతోంది. ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని ఉందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. కొంచెం చూడండి బయ్యా అంటూ కొందరు స్వీట్ గా రిక్వెస్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం మాకు మల్టీస్టారర్ సినిమా కావాల్సిందే అంటూ పదే పదే ప్రశాంత్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తున్నారు. చూస్తుంటే ప్రశాంత్ ఒప్పుకునేవరకు వదిలేలా లేరని తెలుస్తోంది. మరి ఆ దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles