ఆ సర్వేలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న ప్రభాస్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ హీరో తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రతినెల ఆర్మాక్స్ సమస్త ఆ నెల ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాలను విడుదల చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఇదివరకు ప్రతి నెల ఈ సర్వేలో భాగంగా గత కొన్ని నెలలుగా ప్రభాస్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలకు సంబంధించిన సర్వేలో భాగంగా మరోసారి ప్రభాస్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అక్టోబర్ నెలలో గాను అత్యంత ఆదరణ పొందిన హీరోల జాబితాలో ప్రభాస్ పేరు మొదటి స్థానంలో ఉంది.ఈ విధంగా గత కొన్ని నెలలుగా ప్రభాస్ పేరు మొదటి స్థానంలో ఉండడం చూసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సర్వేలో భాగంగా ప్రభాస్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో ఎన్టీఆర్ మూడవ స్థానంలో అల్లు అర్జున్ నాలుగో స్థానంలో మహేష్ బాబు ఐదవ స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. ఇలా ప్రభాస్ మొదటి స్థానంలో ఉండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన ప్రాజెక్ట్ కే, సలార్, ఆది పురుష్ వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.