Prabhas : మరీ వైలెంట్ గా ప్రభాస్… డ్యూయల్ రోల్ లో కనిపించనున్న డార్లింగ్…సలార్ నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్…!

w డేట్ రావడంతో అభిమానుల అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇక సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. సాహో, రాధే శ్యాం నిరాశ పరచడంతో ప్రభాస్ అభిమానులు ఇప్పుడు సోలార్ పై ఆశలు పెట్టుకున్నారు . ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.

ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది . ఇక మరో కీలక పాత్రలో సారా అలీ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో కీలక పాత్రలో మలయాళం హీరో పృథ్వీ కుమార్ నటిస్తున్నాడు. ఇక ప్రభాస్ కు గాయం తగలడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఉగ్రమ్ సినిమాకు రీమేక్ అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని ప్రశాంత్ నీల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

ప్రభాస్ సినిమాలో ఎలా కనిపించబోతున్నారో అన్న ఆసక్తి డార్లింగ్ అభిమానుల్లో పెరగడంతో కేజీఎఫ్2 ప్రమోషన్స్ లో భాగంగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా గురించి స్పందిస్తూ ప్రభాస్ రోల్ వైలెంట్ గా ఉంటుందని అన్నారు. సినిమాలో ప్రభాస్ క్రూరంగా వ్యవహరిస్తారని విలన్స్ విషయంలో ప్రభాస్ కఠినంగా ఉంటారని పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు ప్రభాస్ ఇటువంటి పాత్ర పోషించలేదని క్లారిటీ ఇచ్చారు.తన సినిమాలలోని హీరోల పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఉంటుందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. తన కామెంట్లతో ప్రశాంత్ నీల్ సలార్ పై అంచనాలు పెంచేశారు. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా బాక్సఆఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా అయినా ప్రభాస్ అభిమానుల ఆశలను నెరవేరుస్తుందేమో చూడాలి.