Prabhas : చిన్న సినిమా చేస్తానంటున్న పాన్ ఇండియా హీరో..!

Prabhas:యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, అందాల భామ పూజా హెగ్దే జంటగా నటించిన రాధేశ్యామ్ ఇటీవలే రిలీజ్ కావడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు కృష్ణంరాజు కూడా నటించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత తన స్థాయిని ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసుకున్నాడు అనే చెప్పాలి. ప్రభాస్ కూడా తన రేంజ్ కు తగ్గట్టుగా చాలా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.  ప్రభాస్ చిన్న సినిమాల్లో ఒకే చేసినప్పటికీ కూడా సినిమా పూర్తయ్యే పాటికి 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలతో మారిపోతున్నాయి.

ప్రభాస్ సాహో సినిమా తర్వాత వందకోట్ల బడ్జెట్ లోపే కొన్ని సినిమాలు చేయాలి అనుకున్నాడట. ప్రభాస్ మనసులో చిన్న సినిమాలు చేయాలని ఆశ ఎప్పటినుంచో ఉందట. దీని గురించే యు.వి.క్రియేషన్స్ తో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.అది కూడా రెమ్యూనరేషన్ లేకుండా చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం చాలా మంది హీరోలు ఇలా చేస్తున్నారు, రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా విడుదలైన తర్వాత అందులోనుంచి లాభాలను తీసుకుంటున్నారు.

ప్రభాస్ కూడా మారుతీ దర్శకత్వంలో సినిమా చేయాలని, రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించాలని భావిస్తున్నారట.మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా దాదాపు చిన్న బడ్జెట్ లో రానున్నట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా దాదాపు చిన్న బడ్జెట్ లో రానున్నట్లు తెలుస్తోంది.ఇక ఆ సినిమాకు థమన్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హారర్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కబోయే ఆ సినిమాకు రాజా డీలక్స్ టైటిల్ను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.