Prabhas: హార్రర్ కామెడీ ట్రై చేస్తున్న డార్లింగ్… భూతంగా బొమన్ ఇరానీ…!

Prabhas : సాహో సినిమా తర్వాత ప్రభాస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధే శ్యామ్ కూడా నిరాశపరిచింది. దీంతో ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. అభిమానుల సూచనలను కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ప్రభాస్. ఇక సలార్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రానుందని చిత్రా యూనిట్ ప్రకటించింది. ఇక మరో పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ భారీ సినిమాలను పక్కన పెడితే ప్రభాస్ చిన్న సినిమా చేయాలని అనుకుంటున్నారు.

ఇక మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక చిన్న సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా హార్రర్ కామెడీ గా రూపొందుతోంది.క‌థ ఎప్పుడో ప్ర‌భాస్‌కి వినిపించేశారు. ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశారు. ఈ క‌థ‌ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతున్నాడు మారుతి. ఇదో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర‌ని, లేదు.. ఇదో హార్రర్ సినిమా అని బ‌య‌ట వార్త‌లొస్తున్నాయి. మారుతి మాత్రం ఈ విష‌యంలో నోరు మెద‌ప‌డం లేదు.

ఇందులో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు బొమ‌న్ ఇరానీ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదో హార్రర్ కామెడీ చిత్ర‌మని, బొమ‌న్ ఈ సినిమాలో దెయ్యంగా క‌నిపిస్తార‌ని, ఓ ఇంటి చుట్టూ క‌థ న‌డుస్తుంద‌ని, ఆ ఇంట్లోకి చిత్ర విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో హీరో చేర‌తాడ‌ని, ఆ త‌ర‌వాత ఏమైంద‌న్న‌దే క‌థ‌ని తెలుస్తోంది. కామెడీ సినిమాలు తీయ‌డంలో మారుతి దిట్ట‌. ఆయ‌న హార్రర్ కామెడీ కూడా తీశారు. ఈ జోన‌ర్‌లో `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌` అతి పెద్ద హిట్‌. ఈసారీ ప్ర‌భాస్ కోసం మారుతి అదే జోన‌ర్ ని ఎంచుకున్నార‌ని స‌మాచారం.