ప్రభాస్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో.?

సంపత్ నంది క్లాస్ టచ్ వున్న మాస్ డైరెక్టర్.! ‘రచ్చ’ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు. ఎందుకోగానీ, రేసులో ఈ మధ్య బాగా వెనకబడిపోయాడు. తన టాలెంట్‌కి భిన్నంగా ఏవేవో ప్రయోగాలు చేస్తూ, టైమ్ వేస్ట్ చేసుకుంటున్నాడన్న అభిప్రాయం సంపత్ నంది మీదుంది తెలుగు సినీ పరిశ్రమలో.

ఆ సంగతి పక్కన పెడితే, సంపత్ నంది దర్శకత్వంలో ఓ ప్రెస్టీజియస్ మూవీ కోసం తెరవెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయట. ప్రభాస్ హీరోగా ఈ సినిమా వుండొచ్చన్నది తాజా ఖబర్. ప్రస్తుతానికైతే ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తాడన్న ప్రచారమూ వుంది. ఇంతకీ, సంపత్ నంది – ప్రభాస్ కాంబినేషన్ సంగతేంటి.? వేచి చూడాల్సిందే.