Prabhas : సారా ఆలీ ఖాన్ తో రొమాన్స్ చేయన్నున ప్రభాస్.. సలార్ మూవీ లో కొత్త ట్విస్ట్..!

Prabhas:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల అభిమానులను సంపాదించాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి, ఇటు అస్సాం నుండి గుజరాత్ వరకు ప్రభాస్ మానియా నడుస్తోంది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో తో నార్త్ లో మరింత క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం విడుదలైన రాధేశ్యామ్ సినిమా మిశ్రమ స్పందన తో ముందుకు వెళ్తోంది. రాధేశ్యామ్ సినిమా తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమాలు ఆదిపురుష్ ,సలార్.

‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది.  హై ఓల్టేజ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్  లో బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ చేయబోతోందట.సలార్ లో ప్రభాస్ ప్రేయసిగా నటిస్తోందని,అలాగే ప్రభాస్ కి సారా అలీ ఖాన్ కి మధ్య కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయని సమాచారం.సారా అలీ ఖాన్ ఓ ఉన్నతాధికారి కుమార్తె పాత్రలో కనిపించబోతుందని.. తన అవసరం రీత్యా ఆమెతో లవ్ ట్రాక్ నడిపి అనుకున్నది ప్రభాస్ సాధిస్తాడని,అంతేకాకుండా ఈ పాత్రకు సంబంధించి ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త షెడ్యూల్ షూటింగ్ లో సారా అలీ ఖాన్ పాల్గొంటుందని చెబుతున్నారు.

ప్రభాస్ నటిస్తున్న మరొక సినిమా ఆదిపురుష్ . ఈ సినిమాలో ప్రభాస్ సైఫ్ అలీఖాన్ తో కలిసి నటిస్తున్నారు. ఇలా సలార్ సినిమాలో కూతురితో ను,ఆదిపురుష్ సినిమాలో తండ్రితో ను కలిసి నటిస్తున్నాడు. మొత్తానికి ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ పై భారీ అంచనాలున్నాయి. అంతేకాదు సలార్ నిర్మాతలు సలార్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో కూడా ఉన్నారట.అసలు సలార్ సినిమాని ఎలా తీస్తారో, అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.