రెబల్ స్టార్‌గా, డార్లింగ్‌గా అభిమానులు పిలుచుకునే ప్రభాస్ చాలా రోజుల తరువాత హైదరాబాదులో అడుగు పెట్టారు. ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా డిసెంబర్ 22న విడుదలకి సిద్ధంగా వుంది. ప్రశాంత్ నీల్ దీనికి దర్శకుడు. ఈ సినిమా అనేకసార్లు వాయిదా పది చివరికి డిసెంబర్ 22 తేదీ ఖరారు చేశారు. అయితే గత కొన్ని రోజుల నుండి ఈ తేదీకి కూడా ఈ సినిమా విడుదల కాదు, మళ్ళీ వాయిదా పడే అవకాశాలు వున్నాయి అని సాంఫీుక మాధ్యమంలో వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రభాస్ హైదరాబాదు రావటంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది. ఈ సినిమా అనుకున్నట్టుగానే డిసెంబర్ 22 న విడుదల సిద్ధం అవుతోందని ప్రభాస్ రాకతో తెలియపర్చినట్టు అయింది. 22 ఈ సినిమాలో ఇంకా రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉందని, ఆ రెండు పాటలు రామోజీ ఫిలిం సిటీ లో త్వరలో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
ప్రభాస్ కాలుకి సర్జరీ అయిందని, అందుకనే అతని చాలా కాలం ఇటలీలో విశ్రాంతి తీసుకొని ఇప్పుడు హైదరాబాదులో అడుగు పెట్టారు అని తెలుస్తోంది. ప్రభాస్ ‘సలార్’ సినిమా విడుదలప్పుడే షా రుఖ్ ఖాన్ ‘డంకి’ చఆబీనిసతిసినిమా కూడా విడుదలవుతోంది. ఇలా ఇద్దరి అగ్ర నటుల సినిమాలు ఒకే రోజు విడుదలవడం కొంచెం ఆసక్తికరంగా వుంది. ఎందుకంటే ‘సలార్’ అన్ని భాషల్లో విడుదలవుతోంది, అలాగే ‘డంకి’ కూడా. ‘సలార్’ లో శృతి హాసన్ కథానాయిక, మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రీయ రెడ్డి మున్నగు నటులు వున్నారు.