ప్రభాస్ “రాజా సాబ్” కథ లీక్? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు 

ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న సినిమా “రాజా సాబ్” కూడా ఒకటి. ఇక మొన్ననే పండుగ కానుకగా ఫస్ట్ లుక్ సహా టైటిల్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయగా దీనికి ఫ్యాన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

మెయిన్ గా చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుంచి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఇది వస్తున్నట్టుగా కన్ఫర్మ్ కాగా మేకర్స్ దీనిని కూడా పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఇది వరకే ఈ సినిమా ఒక హారర్ జానర్ సినిమా అని రివీల్ చేశారు. హారర్ సహా ఎంటర్టైనర్ గా కూడా ఈ చిత్రం ఉంటుంది అని తెలిపారు.

మరి ఇప్పుడు ఈ సినిమా కథ ఇది అని ఓ లైన్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రేమలో ఉన్న ఒక జంట తమకి అనుకోని విధంగా నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. దానిని వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు అనేది లైన్ అట. అయితే దీనిపై దర్శకుడు మారుతీ స్పందించాడు.

కథ ఇదే అని తేలిక వీరే కథతో నేను సినిమా చేస్తున్నాను అని ఇప్పుడు ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో స్పందించాడు. దీనితో ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇంకా ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాతో ఈమె టాలీవుడ్ కి పరిచయం అవుతుంది. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. బహుశా ఈ ఏడాదిలోనే ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయవచ్చు. ఆల్రెడీ మే లో ఓ సినిమా “కల్కి” లాక్ అయ్యి ఉన్న సంగతి తెలిసిందే.