“సలార్” ట్రైలర్ రూమర్స్ పై ప్రభాస్ టీం బిగ్ క్లారిటీ..!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న బిగ్గెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్ లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసిన చిత్రం “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” కూడా ఒకటి.

ఇక ఈ చిత్రం రిలీజ్ కి సమయం దగ్గరకి వస్తుంది. మేకర్స్ కూడా దీపావళికి ముందే నుంచే క్రేజీ అప్డేట్ లు ఇస్తుండగా నిన్న ట్రైలర్ పై కూడా క్రేజీ సమాచారాన్ని అందించారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు కానీ అన్ అఫీషియల్ గా ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ అవుతుంది అని అయితే సినీ వర్గాలు తేల్చేశాయి.

అయితే ట్రైలర్ విషయంలో ఇంకో క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. దాని ప్రకారం వచ్చే ట్రైలర్ అయితే గతంలో వచ్చిన సలార్ టీజర్ మరియు కేజీఎఫ్ టీజర్ ల ట్రెండ్ లోనే ఒక్క భాషలో మాత్రమే వస్తుంది అని వచ్చింది. దీనితో ఈ టాక్ బాగా వైరల్ గా మారగా దీనిపై సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ టీం స్పందించారు.

ప్రస్తుతానికి ఆ వార్తలు అవాస్తవం అని అలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా తామే చెప్తామని ఆ వార్తలని బ్రేక్ చేశారు. దీనితో ఆ రూమర్స్ పై ఓ బిగ్ క్లారిటీ వచ్చినట్టు అయ్యింది అని చెప్పవచ్చు. మరి మున్ముందు దీనిపై ఏమన్నా డీటెయిల్స్ వస్తాయేమో చూడాలి.