మోకాళ్ళ సమస్యతో బాధపడుతున్న ప్రభాస్.. జక్కన్న పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..?

టాలీవుడ్ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ప్రభాస్ బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్’ఆది పురుష్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా ఇటీవల సినిమా యూనిట్ తో కలిసి అయోధ్య చేరుకొని అక్కడ శ్రీరాముడిని దర్శించుకున్న ప్రభాస్ గుడిమెట్లు దిగటానికి ఇబ్బంది పడుతూ ఇద్దరి సహాయంతో మెట్లు దిగారు. ఈ వీడియో చూసిన అభిమానులు.. ప్రభాస్ మోకాళ్ళ పరిస్థితి చూసి బాధపడుతున్నారు. చాలాకాలంగా ప్రభాస్ మోకాల సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్యకు శస్త్ర చికిత్స మాత్రమే నివారణ అని తెలిసినా కూడా వరుస సినిమా షూటింగ్ ఉండటంవల్ల ప్రభాస్ చికిత్స చేయించుకోకుండా ఇంజక్షన్స్ తో కాలం గడుపుతున్నారు.

అయితే ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి ఇలా దీనంగా మారటానికి కారణం రాజమౌళి. బాహుబలి సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం ప్రభాస్, రానాని రాజమౌళి చాలా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత రానా కూడా అనారోగ్యం పాలై కోలుకున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం ఈ సమస్య నుండి కోలుకోలేక పోతున్నాడు. దీంతో తమ అభిమాన హీరో పరిస్థితి ఇలా కావడానికి కారణం రాజమౌళి అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.