ప్రభాస్ పరిస్థితి దారుణంగా ఉంటుంది… వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలియని వారంటూ ఉండరు. సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయిన సెలబ్రెటీల జాతకాల గురించి తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వేణు స్వామి బాగా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా సమంత,నయనతార వంటి హీరోయిన్ల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా తాను చెప్పిన మాటలు వాస్తవమని నిరూపించే ప్రయత్నాలు కూడా చేశాడు. గతంలో సమంతా నాగచైతన్య వివాహం జరిగిన సమయంలో వారిద్దరు తొందర్లోనే విడిపోతారని వేణు స్వామి చెప్పినట్టుగానే వారిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకే సమంతా నాగచైతన్య దూరమయ్యారు.

ఇక స్టార్ హీరోయిన్ నయనతార కూడా పెళ్లి జరిగితే ఆమె జాతకం ప్రకారం అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ జాతకం గురించి కూడా వేణు స్వామి తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి ప్రభాస్ జాతకం ప్రకారం అతని ఆరోగ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ జాతకం గురించి యాంకర్ ప్రశ్నించగా.. వేణు స్వామి మాట్లాడుతూ ప్రభాస్ జాతకం ప్రకారం ఆయన జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అంతేకాకుండా ప్రభాస్ కి జాతకాల పట్ల నమ్మకం లేదని అందువల్లే జాతకాల కాన్సెప్ట్ తీసిన ప్లాప్ అయ్యిందని గుర్తు చేశాడు. అలాంటి సినిమాలు తీయాలన్నప్పుడు మొదట మనం జాతకాలు నమ్మే తర్వాత అలాంటి సినిమాలు తీయాలని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ జాతకంలో ప్రస్తుతం శని స్థానం మారటం వల్ల జీవితంలో అతను అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని, ఆయన జాతకాలను నమ్మకపోవటం వల్ల తనతో పాటు తన చుట్టూ ఉన్న ప్రజలు కూడా చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుందని వెల్లడించాడు. ప్రభాస్ అనేది ఒక వ్యక్తి కాదు…ఒక వ్యవస్థ. ఆయనని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి సమయంలో అతను ఈ జాతకాలు పరిహారాలు పట్ల నమ్మకంగా ఉండాలని కానీ ఆయనకు జాతకాల పట్ల నమ్మకం లేకపోతే మనం వాటి గురించి చెప్పి బాధపడటం తప్ప ఏం చేయలేమని వేణు స్వామి వెల్లడించాడు.