ప్రభాస్ కు పెళ్లి అచ్చిరాదు… చేసుకుంటే ఆ హీరో గతే పడుతుంది: వేణు స్వామి

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయ్యారు. బాహుబలి సినిమా తర్వాత సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు. ఇకపోతే సినిమాల పరంగా ఎంతో మంచి స్థానంలో ఉండి అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభాస్ పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉండాలని అభిమానులు ముచ్చట పడుతున్నారు. ఈ క్రమంలోని ఈయన పెళ్లి వార్త ఎప్పుడు చెబుతారా అని అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ప్రభాస్ ఇప్పటికే నాలుగు పదుల వయసులోకి అడుగు పెట్టారు. ఈయన వెంటనే పెళ్లి చేసుకుంటేనే బాగుంటుందని, ఆ శుభవార్త ఎప్పుడు చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ప్రబాస్ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు విన్న ప్రభాస్ అభిమానులు ప్రభాస్ జీవితంలో పెళ్లి కాకపోయినా పరవాలేదు ఆయన క్షేమంగా ఉంటే చాలు అని భావిస్తున్నారు.

సమంత నాగచైతన్య విషయంలో వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు నిజం కావడంతో వేణు స్వామి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అప్పటినుంచి ఈయనచెప్పే వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరో హీరోయిన్ల జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో ఉండే ఈయన తాజాగా ప్రభాస్ జాతకం చెప్పారు. ప్రభాస్ జీవితంలో పెళ్లి అచ్చు రాదని తెలిపారు. అలా కాదని పెళ్లి చేసుకుంటే హీరో ఉదయ కిరణ్ కి పట్టిన గతే ప్రభాస్ కి పడుతుందని ఈయన షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇలా వేణు స్వామి ప్రభాస్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ కి పెళ్లి కాకపోయినా పర్లేదు కానీ ఆయన బాగుండాలి అని కోరుకుంటున్నారు.