రాజమౌళి వల్లే “సలార్”..ప్రభాస్ ట్విస్ట్.!

జస్ట్ మరో రెండు రోజుల్లో భారీ అంచనాలు నడుమ ఇండియా వైడ్ గా కూడ బిగ్ స్క్రీన్స్ పై రిలీజ్ కి రాబోతున్న సినిమాల్లో మన తెలుగు నుంచి రానున్న చిత్రం “సలార్ సీజ్ ఫైర్” కూడా ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన మొదటి సినిమా ఇది కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

అయితే ఈ చిత్రం రిలీజ్ ఇప్పుడు మరికొన్ని రోజుల్లోనే ఉండగా చిత్ర బృందం ఇండియాస్ టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో ఓ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూని కూడా ప్లాన్ చేశారు. కాగా ఈ ఇంటర్వ్యూ కోసం చాలా మంది చాలా రోజులు నుంచి వెయిట్ చేయగా ఫైనల్ గా అయితే ఈ ఇంటర్వ్యూ ఇవాళ వచ్చింది.

మరి ఇందులో ప్రభాస్ అసలు ఈ సినిమా తన దగ్గరకి ఎలా వచ్చింది ఎలా ఓకే అయ్యింది అనేది రివీల్ చేసాడు. తనకి సలార్ అనే సబ్జెక్టు ని ప్రశాంత్ నీల్ చెప్పిన తర్వాత తాను మొదటిగా రాజమౌళికి కాల్ చేయగా తాను ఒక మాట చెప్పాడని. నీల్ తో సినిమా నువ్వేం మాట్లాడకుండా చేసేయ్ అని చెప్పాడట.

దీనితో ఈ సినిమా చేయడానికి ఉన్న కారణాల్లో రాజమౌళి కూడా ఒకడని ప్రభాస్ రివీల్ చేసాడు. సో అలా ఈ బిగ్గెస్ట్ అండ్ మాస్ కాంబినేషన్ కి రాజమౌళి కారణం అయ్యాడు.