ఓవర్సీస్ లో సలార్ బ్రేక్ ఎవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ లో మోస్ట్ అవాటెడ్ సినిమాల జాబితాలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీ కచ్చితంగా ఉంటుంది అని చెప్పాలి. కేజీఎఫ్ సిరీస్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా డైరెక్టర్ కలయికలో హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో సలార్ సిద్ధం అవుతోంది.

ఈ సినిమాలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్స్ గా నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇక ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నారు. ఇందులో పార్ట్ వన్ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే నిర్మాత విజయ్ కిరంగదూర్ స్టార్ట్ చేశారంట. అన్ని భాషలలో కలిపి కనీసం 6 నుంచి 700 కోట్ల వ్యాపారం ఈ మూవీపై చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రాంతీయ భాషలకు సంబంధించిన థీయాట్రికల్ బిజినెస్ 300 కోట్ల వరకు జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రికార్డు స్థాయిలో ఉండటం విశేషం. టెన్ మిలియన్ డాలర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సలార్ రిలీజ్ కాబోతోంది అంట. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మొట్టమొదటిసారిగా సలార్ సినిమా హైయెస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఓవర్సీస్ మార్కెట్ లో రిలీజ్ కాబోతుండడం అరుదైన రికార్డుగా చెప్పాలి.

ఈ స్థాయిలో సలార్ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో కలెక్ట్ చేయగలిగితే సంచలనమే అవుతుంది. అయితే ఈ మూవీకి ఉన్న బజ్ నేపథ్యంలో ఆ స్థాయిలో కలెక్షన్స్ రావడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే దర్శకుడు ప్రశాంతి నీల్ కేజీఎఫ్ సిరీస్ కంటే అద్భుతమైన కథని సలార్ మూవీలో చూపించాల్సి ఉంటుంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వస్తే ఒక అంచనాకు రావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.