సలార్.. అసలు సందడి షురూ!

ప్రభాస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోకి రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.

ఇక ప్రభాస్ ఇంతకుముందు చేసిన పాన్ ఇండియా సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ అవుతూ ఉండడంతో ఈ సినిమాతో అయితే అతను సక్సెస్ అందుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ మరి కొన్ని రోజుల్లో మొదలు కాబోతున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల గాసిప్స్ వస్తున్నాయి.

ఇక ఆ గాసిప్స్ వైరల్ అవుతున్న సమయంలో ఇప్పుడు మరొక ఆసక్తికరమైన లీక్ అయితే ఫాన్స్ లో ఆనందాన్ని కలిగిస్తోంది. సలార్ సినిమా మొదటి పాటను ఈ వారంలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. లేకపోతే వచ్చేవారం మొదట్లోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలి అని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.

ఇక సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో అయినా ప్రభాస్ వరుస డిజాస్టర్లకు బ్రేక్ వేస్తాడో లేదో చూడాలి. ఇక మరోవైపు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తో పాటు కల్కీ పనుల్లో కూడా బిజీబిజీగా పాల్గొంటున్నాడు. ఇక ముందుగా అయితే సలార్ విడుదల తర్వాతనే ఆ సినిమాలో అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది.