“సలార్ 2” ఎలా ఉండబోతుందో చెప్పేసిన ప్రభాస్..

ఫ్యాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “సలార్” మొన్న రిలీజ్ అయ్యి ఎంత రికార్డు ఓపెనింగ్స్ అందుకొని రెండో రోజు కూడా మాస్ వసూళ్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంకి రెండు భాగాలూ ఉంటాయని మేకర్స్ ముందే కన్ఫర్మ్ చేసారు.

కాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా తాను తీయడానికి తన ఉగ్రం సినిమానే చేసాడు కానీ దానిని తన విజన్ తో మరింత గ్రాండ్ గా ఎక్స్ పాండ్ చేసి సిద్ధం చేసాడు. అయితే ఈ చిత్రం సీజ్ ఫైర్ అని చెప్పి మొదటి భాగాన్ని విడుదల చేయగా రెండో భాగాన్ని అయితే శౌర్యంగా పర్వంగా అనౌన్స్ చేసారు.

ఇక రెండో పార్ట్ కూడా ఎక్కువ అంచనాలు నెలకొల్పుకోగా ఈ పార్ట్ 2 పై అయితే హీరో ప్రభాస్ దీనిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను మాట్లాడుతూ పార్ట్ 2 సినిమా పార్ట్ 1 ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మొదలవుతుంది అని కానీ పార్ట్ 1 కంటే శౌర్యంగా పర్వం చాలా గ్రాండ్ గా ఉంటుంది అని తెలిపాడు.

దీనితో సలార్ పార్ట్ 2 మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని అర్ధం అయ్యిపోయింది. అయితే ఈ పార్ట్ 2 షూటింగ్ ఆల్రెడీ కొంతమేర కంప్లీట్ చేశారు. కానీ కంప్లీట్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నే అని చెప్పాలి. మరి చూడాలి ప్రశాంత్ నీల్ ఎప్పుడు ఫ్రీ అయ్యి ఈ బిగ్గెస్ట్ సీక్వెల్ ని రెడీ చేస్తాడో అనేది.