హ్యాకర్స్ నుంచి తన ఖాతా ప్రభాస్ వెనక్కి తెచ్చుకున్నాడా.?

Prabhas-hospitalised-in-Spain-post-an-accident-on-the-sets-of-Salaar-1280x720

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో ఉన్న భారీ అంచనాలు ఉన్న దాదాపు అన్ని చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రబస్ పేరు కూడా తప్పకుండ ఉంటుంది. కాగా ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాల్లో ఈ ఏడాదిలోనే రిలీజ్ కి రాబోతున్న సెన్సేషనల్ చిత్రం “సలార్”.

సలార్ సీజ్ ఫైర్ గా రిలీజ్ చేస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉండగా మరో పక్క అయితే తాను చేస్తున్న భారీ చిత్రం “కల్కి” చిత్రం కూడా ఇంటర్నేషనల్ వైడ్ గా భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లోనే ప్రభాస్ కి సంబంధించి ఫేస్ బుక్ అకౌంట్ ని అయితే ఎవరో హ్యాక్ చేసిన వార్త షాకింగ్ గా మారింది.

అయితే దీనిపై వెంటనే ప్రభాస్ కూడా పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ కి తెలియజేయగా తన టీం కూడా ఆ ఖాతాని మళ్ళీ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము అని అయితే తెలిపాడు. మరి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఫైనల్ గా హ్యాక్ అయ్యిన ప్రభాస్ అకౌంట్ మళ్ళీ రికవర్ చేసారు.

మరి అలా చేయడమే కాకుండా ప్రభాస్ కూడా రికవర్ అయ్యిన తర్వాత తన కవర్ పిక్ గా ఫేస్ బుక్ లో సలార్ పోస్టర్ ని అయితే అప్డేట్ చేసాడు. దీనితో ఇప్పుడు ఇవి వైరల్ గా మారాయి. కాగా ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ వర్క్ చేయగా హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. అలాగే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.