Radhe shyam: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాని ఈ నెల 11వ తేదీ విడుదల చేయడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది.
ప్రేమకు, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణే అంటూ మరింత ఆసక్తిని పెంచేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా సెన్సార్ సభ్యులు సినిమా రన్ టైం కూడా లాక్ చేశారు.
ప్రభాస్ నటించిన ఈ సినిమా 2 గంటల18 నిమిషాల రన్ టైం ఉండబోతోందని తెలుస్తోంది. టీ సిరీస్ యు.వి క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఒకేసారి 5 భాషలలో విడుదలకానుంది. ఇలా బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్ లలో విడుదల కానున్న సినిమాగా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా చిత్రం కావడంతో తెలుగులో ఈ సినిమాకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇవ్వగా హిందీలో లో అమితాబచ్చన్ ఇచ్చారు. అలాగే తమిళంలో కట్టప్ప సత్యరాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది.