ప్రభాస్ రాధే శ్యాం రిలీజ్ డేట్ ఫిక్స్ కాని అందుకే అనౌన్స్ చేయలేదు ..?

ప్రభాస్ కెరీర్ లో చేస్తున్న 20వ సినిమా రాధే శ్యాం. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ గురించి ఎప్పుడు సర్‌ప్రైజింగ్ న్యూస్ వస్తుందా అని దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్‌ సినిమా టీం అప్‌డేట్స్ రావడం లేదని డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నా సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ సినిమా‌ నుంచి ఫ్యాన్స్ సంబర పడే సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వస్తుందని ఎదురు చూసిన ప్రతీసారి మేకర్స్ దారుణంగా డిసప్పాయింట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి మేకర్స్ డార్లింగ్ ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతూనే ఉన్నారు.

ఈ విషయంలో ఇప్పటికే చాలా సార్లు డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడో రాధేశ్యామ్‌ టైటిల్ తో పాటు ప్రభాస్ – పూజా హెగ్డే ల ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి కాస్త ఊరట కలిగించారు. దాంతో ఫ్రస్టేషన్ లో ఉన్న ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. అయితే రాధేశ్యామ్‌ కంటే తర్వాత మొదలైన సినిమాల నుంచి టీజర్స్ రిలీజై రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. కాని రాధేశ్యామ్ టీజర్ కోసం మాత్రం ఫ్యాన్స్ పడిగాపులు కాస్తున్నారు. న్యూ ఇయర్ కి వస్తుందనుకున్న టీజర్ సంక్రాంతికి అన్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ తో రాధేశ్యామ్‌ టీజర్ పోటీగా రిలీజవుతుందని అనుకున్నారు.

కానీ మళ్ళీ ఫ్యాన్స్ హర్ట్ అవడం తప్ప మిగిలింది ఏమీ లేదు. రాధేశ్యామ్ టీజర్ త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అంతేకాదు రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసి పెట్టారట మేకర్స్. ఏప్రిల్ 30 న ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అన్నీ కార్యక్రమాలు చక చకా జరుగుతున్నాయట. అయితే వీఎఫెక్స్ వర్క్ రాధేశ్యామ్ కి ఎక్కువగా ఉండటం తో ప్రస్తుతానికి ఈ డేట్ ని అనౌన్స్ చేయడం లేదని అంటున్నారు. అయితే రాధేశ్యామ్ డేట్ ప్రచారంలో మాత్రం జూలై 12న అని తిరుగుతోంది.