గ్లింప్స్ టాక్ : సెన్సేషనల్ విజువల్స్ తో ప్రభాస్ “కల్కి 2898 ఏడి”

ఇప్పుడు ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలే చాలా ఉండగా వాటిలో ఇప్పుడు రిలీజ్ కి రాబోతున్న చిత్రాలు సలార్ అలాగే దీని తర్వాత ప్రాజెక్ట్ కే కూడా ఒకటి.

అయితే ఈ మాసివ్ చిత్రాల్లో ఇప్పుడు ప్రాజెక్ట్ కే అయితే ఇండియన్ సినిమాని టేకోవర్ చేసింది. కాగా నిన్న అర్ధ రాత్రి సమయంలో ఈ సినిమా అవైటెడ్ గ్లింప్స్ ని విడుదల చేశారు. హాలీవుడ్ ప్రముఖ ఈవెంట్ కామిక్ కాన్ లో మొదటగా రిలీజ్ చేయగా ఇండియన్ సినిమా టైం ప్రకారం అయితే 2 గంటల మధ్యలో ఇది వచ్చింది.

ఇక ఈ గ్లింప్స్ మాత్రం ఊహించని లెవెల్లో సెన్సేషనల్ విజువల్స్ తో ఉందని చెప్పాలి. ఇది చూసాక మాత్రం ఇండియన్ సినిమా తాలూకా రూపు రేఖలనే ఈ సినిమా రిలీజ్ అయ్యాక మార్చేసేలా ఉందని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి “కల్కి 2898 ఏడి” అనే టైటిల్ ని కూడా రివీల్ చేయగా ఇందులో అయితే మొత్తం భవిష్యత్తుకి చెందిన విజువల్స్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ చూపించాడు.

అయితే ఈ విజువల్స్ అన్నీ కూడా కేజ్రీగా కనిపించిన సినిమా విలన్ కమల్ హాసన్ తప్ప అంతా కనిపించారు. మరి ప్రభాస్ తన డాషింగ్ లుక్స్ తో సూపర్ హీరోగా అదరగొట్టగా నాగ్ అశ్విన్ చాలా వరకు మంచి వి ఎఫ్ ఎక్స్ ని చూపించి ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. అయితే ఇందులో డిజప్పాయింటింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అని చెప్పాలి.

ఈ సినిమా గ్రాండ్ విజువల్స్ ని తన స్కోర్ మ్యాచ్ చెయ్యలేకపోయింది. తాను లాస్ట్ చేసిన “దసరా” బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గుర్తుకొస్తుంది. దీనిని ముందు కరెక్ట్ చేసుకోవాలి. మొత్తంగా అయితే ఓ భారీ ట్రీట్ ని వచ్చే ఏడాది మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు. మరి ఈ సెన్సేషనల్ చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాలి. 
Kalki 2898 AD Glimpse | Prabhas | Amitabh Bachchan | Kamal Haasan | Deepika Padukone | Nag Ashwin