Prabhas : ఇండియాలో హాట్ క్రేజీ సూపర్ అంటారు ఎవరంటే ఆడే ప్రభా డార్లింగే. బాహుబలి తో వచ్చిన ఈ క్రేజ్ సాహో, రాధే శ్యామ్ సినిమాలు డిజాస్టర్ అయినా కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఇంత క్రేజ్ బాలీవుడ్ ను సైతం విస్మయానికి గురిచేసింది. అయితే ఒక్కసారి ఈ క్రేజ్ వల్ల కుడా ఇబ్బందులోస్తాయి. సినిమాలను ఎంచుకునే స్వేచ్ఛ తగ్గిపోతుంది హీరోలకు తనకు నచ్చిన పాత్రలు చేయాలన్నా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సి వస్తుంది. ఇక ఇపుడు ప్రభాస్ అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు.
ఈ ఇమేజ్ చట్రంనుండి బయటపడటానికి ప్రభాస్ ఒక చిన్న సినిమా ను అదికూడా ఒక కమర్షియల్ సినిమా, కామెడీ ప్రధానంగా తీయాలనీ భావిస్తున్నారు. అది కూడా తక్కువ బడ్జెట్ తో కానీ అది ఎలా సాధ్యం. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం వల్ల మార్కెట్ ఎక్కువ కాబట్టి ప్రభాస్ రెమ్యూనరేషనే 100కోట్లుగా ఉంది. మరి చిన్న బడ్జెట్ సినిమా ఎలా తీస్తారు అన్నది ఇక్కడ సందేహం.ఇక రాధే శ్యామ్ మిగుల్చిన నష్టాలను భర్తీ చేస్తూ తక్కువ బడ్జెట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. ఇక ఇందుకోసం తన రెమ్యూనరేషన్ ను త్యాగం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.
50 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. కామెడీ కథగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమా ద్వారా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోనున్నారని సమాచారం అందుతోంది. మారుతి మూవీతో ప్రభాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. ఇక ఇపుడు ప్రభాస్ ఆది పురుష్, సలార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి ప్రభాస్ ఖాతాలో తొమ్మిది సినిమాలు ఉన్నట్లు సమాచారం.