ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినటివంటి ప్రభాస్ హీరోగా నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా సలార్ రిలీజ్ తో మళ్ళీ అన్ని సమీకరణాలు మారుతున్నాయి. కాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా తన కేజీఎఫ్ సినిమాలు తర్వాత వస్తుండడంతో నెక్స్ట్ లెవెల్ హైప్ దీనిపై కూడా నెలకొంది.
అయితే ఈ సినిమా సహా దర్శకుడు మారుతీ మరియు దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాల్లో పాల్గొన్న ప్రభాస్ ఎన్నో ఏళ్ల నుంచి తన మోకాలి సమస్యతో బాధ పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా అప్పుడెప్పుడో బాహుబలి టైం లో తగిలిన దెబ్బ ప్రభాస్ ని నొప్పితో అలా బాధిస్తూనే ఉంది.
అయినా కూడా ప్రభాస్ చిత్రాలు తన ఫ్యాన్స్ కోసం దానిని భరిస్తూనే చేస్తున్నాడు. కాగా ఇప్పుడు తనకి దొరికిన గ్యాప్ లో అయితే ప్రభాస్ యూఎస్ వెళ్లి తన మోకాలి ఆపరేషన్ చేయించేసుకున్నాడని నయా అప్డేట్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అంట కానీ అప్పుడే తాను నడిచే వీలు లేదట.
ప్రస్తుతానికి తాను యూఎస్ లోనే ఉండి రెస్ట్ తీసుకోవాల్సి ఉందట. ఈ తర్వాత కూడా ప్రభాస్ ఇంకో నెల పాటుగా కూడా రెస్ట్ లోనే ఉండాలని మళ్ళీ తాను సినిమాలు నవంబర్ నుంచే స్టార్ట్ చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సలార్ రిలీజ్ ని కూడా ఆ తరువాతే పెడుతున్నారని తెలుస్తుంది.