ప్రభాస్ మూవీ.. మ్యూజిక్ పై మళ్ళీ కన్ఫ్యూజన్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రయోగాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. గతేడాది ఆగస్టులో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరగ్గా ఇప్పటికీ ఈ సినిమా విషయంలో పలు విషయాలపై క్లారిటీ రాలేదు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఇంకా డైరెక్టర్ వెనక్కి వస్తూనే ఉన్నారు.

అయితే థమన్ రెగ్యులర్ గా దర్శకుడు మారుతికి టచ్ లోనే ఉంటున్నా… డైరెక్టర్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదట. ఈ సినిమాకు ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది తెలియదు. అయితే ఇన్నాళ్లు ప్లాప్ లతో ఇబ్బంది పడ్డ మారుతి.. ఈసారి పాన్ ఇండియా స్టార్ తో ఎలాగైనా సరే హిట్టు కొట్టాలనుకుంటున్నాడు. అందుకే అన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించుకొని ఆచుతూచి అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కావాలని థమన్ ను కాస్త పక్కన పెట్టినట్లు.. మరెవరైనా దొరుకుతారేమో అని చూస్తున్నారు.

మారుతితో ప్రభాస్ సినిమా చేయడం అతడి అభిమానులకు నచ్చలేదు. అందుకే మారుతిని టాలీవుడ్ నుంచి బహిష్కరించాలంటూ బాయ్ కాట్ మారుతి ఫ్రమ్ టీఎఫ్ఐ హ్యాష్ ట్యాగ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ వరుసగా ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్స్ గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. వీటన్నిటికి సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే మారుతి అన్ని విషయాలను ఆలోచించుకున్నాకే నిర్ణయం తీసుకోనున్నారు.

ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా… కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ విషయాలపై అధికారిక ప్రకటన రాలేదు. పీపుల్స్ మీడియా ప్యాక్టరీ బ్యానర్ లో ఆ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. అంతేకాదండోయ్ ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఓ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కూడా నటిస్తున్నారట. అంటే స్టార్ డమ్ తో ఎలాగో తెలుగులో సహా పాన్ పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.