Prabhas : ప్రభాస్ మారుతీ ల సినిమాకి టైటిల్ సెట్ అయినట్టేనా..?

Prabhas :బాహుబలి సినిమా తో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో వున్నారు.ఇటీవల ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం అయిన రాధే శ్యామ్ ఆశించిన విజయాన్ని ఇవ్వక పోవడం తో ప్రభాస్ నటించే తదుపరి చిత్రాల పైన అభిమానుల ఉత్కంఠ పెరిగింది. రాధేశ్యాం సినిమా తరువాత ప్రభాస్ వరుసగా హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. కేజిఎఫ్ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా మీదనే అభిమానుల ఆశలు అన్నీ ఉన్నాయి. సలార్ తర్వాత ఆదిపురుష్, ప్టాజెక్ట్ కే వంటి చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. అయితే ప్రభాస్ చేస్తున్న తదుపరి చిత్రాలు అన్నీ పాన్ ఇండియా చిత్రాలే.

ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట.ఈ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయ్.అంతే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్ లు నటిస్తున్నట్టు కూడా సమాచారం.ఈ సినిమాకు “రాజా ఢిలక్స్” అనే టైటిల్ ను రిజిస్టర్ కూడా చేసినట్టు సమాచారం.

అయితే ఈ సినిమాను మారుతీ తన మార్క్ కామెడీ తోనే కాకుండా సొసైటీ కి ఒక మెసేజ్ కూడా ఇచేలా తీయబోతున్నారట. ఈ సినిమాకి సంబందించిన అధికారిక సమాచారం త్వరోలోనే చిత్ర బృందం తెలియచేస్తారట. ప్రభాస్ మారుతీ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రభాస్ కు 26వ చిత్రం, ఇక 25 వ చిత్రంగా స్పిరిట్ అనే చిత్రన్ని తీస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాకు సంబంధించిన టీజర్ మే నెలలో వచ్చే అవకాశాలు కూడా వున్నాయట.వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి మిగిలిన ప్రాజెక్ట్ ల సంగతి చూడాలని ప్రభాస్ ఆలోచ్చుస్తున్నట్టు సమాచారం.