ఆ హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి?

టాలీవుడ్ లో నలభై ఏళ్ళు వచ్చిన ఇంకా ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ లా ప్రభాస్ సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ‘బాహుబలి’ సినిమా అప్పటినుండి కృష్ణం రాజు ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకుంటాడని చెప్తూ వచ్చారు, కానీ అది జరగలేదు. ప్రభాస్ పెళ్లి చూడకుండానే కృష్ణం రాజు కన్ను మూసారు. ప్రభాస్ ఫ్రెండ్ ఒకతను ప్రేమలో మోసపోవడం తో ప్రభాస్ కి కూడా పెళ్లి మీద నమ్మకం పోయిందని వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో చెప్పారు.

అయితే తాజా సమాచారం ప్రకారం కృషం రాజు సన్నిహితుడు చిట్టిబాబు ప్రభాస్ కి కృష్ణం రాజు కూతుళ్ళ పెళ్లి చేసే భాద్యత ఉందని అలాగే ఈ ఏడాది లోపు ప్రభాస్ పెళ్లి కావొచ్చని చెప్పారు. అయితే అనుష్క, ప్రభాస్ లు పెళ్లి చేసుకోవచ్చనే హింట్ కూడా ఇచ్చారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ప్రభాస్ తన పెళ్లి గురించి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.