Prabhas : ప్రభాస్ ను రాధే శ్యామ్ సినిమా బాగా దెబ్బేసింది.సాహో నిరాశపరిచింది అనుకుంటే మళ్ళీ రాధే శ్యామ్ దెబ్బమీద దెబ్బలా మారింది.సాహో అన్నా కనీసం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ సాధించింది. ఇక రాధే శ్యామ్ కు అది కూడా లేదు.ఇలా ఎందుకంటే కారణం ప్రభాస్ పాన్ ఇండియా సినిమా అంటూ తెలుగుతనానికి దూరమవ్వడమే. రెండు సినిమాల్లోను ప్రభాస్ లుక్,కథ, పాటలు అన్ని తెలుగుతనానికి దూరంగా ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక ఈ రెండు సినిమాలు బయ్యర్స్ కు భారీ నష్టాలే మిగిల్చాయి.
ఇక ఆలోచనలో పడ్డ ప్రభాస్ ఒక తక్కువ బడ్జెట్ లో తెలుగు మాస్ సినిమా చేయాలని ఆలోచించాడు. అందుకే ప్రభాస్ ఓ తెలుగు దర్శకుడితో సినిమా చెయ్యాలి. అందుకే హడావిడిగా మారుతీ ప్రాజెక్టు వార్తల్లోకి వచ్చింది. నిర్మాత డివివి దానయ్య ప్రభాస్ కు రూ.75 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చి రెడీగా ఉన్నారు. ఏప్రిల్ 10నే ఈ చిత్రం మొదలు కాబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది.
ఏప్రిల్ 10న ప్రభాస్- మారుతీ ల సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. అసలు సినిమా ఉంటుందా లేదా అన్న క్లారిటీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. హార్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమా వుంటుందని కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయని ఊరించి చివరకు ఫ్యాన్స్ ను ఉసురుమనిపించారు. ఈ సినిమా కథా తొలుత మెగాస్టార్ కు వినిపించగా ఓకే చేసిన ఇతర కారణాల వాళ్ళ చేయలేకపోయారట. ఇక ప్రభాస్ కు ఈ కథా బాగా సరిపోతుందని మారుతీ భావించారు. ఇక ఈ సినిమా అసలు సెట్స్ పైకి వెళ్తుందో లేదో క్లారిటీ ఇస్తే బాగుంటుందని అందరు అనుకుంటున్నారు.