యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ కాస్త అనారోగ్యంతో సినిమాలకి కొంచెం తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ పాన్ ఇండియా స్టార్ నుంచి ఇప్పుడు చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. పైగా సెట్స్ లో ఉన్నవి కొన్ని అయితే ఇంకా స్టార్ట్ కావలసి ఉన్నవి అలాగే ప్రభాస్ ఓకే చెయ్యాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి.
అయితే ప్రభాస్ కి నమ్మకం చాలా ఎక్కువ అదే నమ్మకం కొంతమంది దర్శకుల విషయంలో తన కెరీర్ కి ఫ్యాన్స్ కి దెబ్బ పడేలా చేసింది. మరి ఈ లైనప్ లో ప్రభాస్ చేసి లాస్ట్ డిజాస్టర్ సినిమా “రాధే శ్యామ్”. యంగ్ దర్శకుడు రాధా కృష్ణ తో చేసిన ఈ సినిమా ప్రభాస్ కి ఏమో కానీ తన ఫ్యాన్స్ కి గట్టి దెబ్బ పడేలా చేసింది.
కాగా ఇప్పుడు లేటెస్ట్ గాసిప్ ఏమిటంటే ఇదే దర్శకుడికి మళ్ళీ అవకాశం ఇస్తున్నాడని ఇన్సైడ్ టాక్. ఒకవేళ ఇదే కానీ నిజం అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. ప్రస్తుతానికి ఇంకా చర్చల్లోనే ఈ సినిమా ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
అలాగే ఈ కాంబినేషన్ మళ్ళీ అనౌన్స్ అయ్యితే అసలు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది కూడా చూడాలి. కాగా ప్రభాస్ అయితే కోలుకున్నాక ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్ లో తాను పాల్గొననున్నాడు. తర్వాత ప్రాజెక్ట్ కే సినిమాలో తాను వర్క్ చేయనున్నాడు.