సలార్.. లెక్కల నుంచి తప్పుకున్న ప్రభాస్

ప్రభాస్ నుంచి రాబోతున్న సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం పక్కా అని అనిపిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను నెవర్ బిఫోర్ అనేలా తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ద్వారా అయితే సినిమాకు కావలసినంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పెరిగాయి.

ఇక ప్రస్తుతం నిర్మాతలు అన్ని వైపుల బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక మొదట ప్రభాస్ ఈ బిజినెస్ డీల్స్ లో చర్చలు జరిపాడు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను తన స్నేహితులైన యూవీ క్రియేషన్స్ కు ఒక మంచి రేటుకు సెట్ చేయాలని అనుకున్నాడు.

కానీ మళ్ళీ అతను సడన్ గా ఆ విషయం పై సైలెంట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆదిపురుష సినిమా తోనే కాకుండా అంతకుముందు వచ్చిన రాధేశ్యామ్ సినిమా కూడా ఊహించని స్థాయిలో దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు సినిమాల బిజినెస్ లో కూడా ప్రభాస్ ముందు చర్చలు జరిపాడు. ఇక ఈ బిజినెస్ డీల్స్ కలిసి రావడం లేదు అని సలార్ విషయంలో అసలు ఏమాత్రం సంబంధం లేనివిధంగానే ప్రభాస్ వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక నిర్మాణ సంస్థ హోంబెల్ ప్రొడక్షన్ కూడా సలార్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ తోనే సేఫ్ గా ప్రాఫిట్స్ రాబట్టాలి అని ఫిక్స్ అయింది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను కొనుగోలు చేసేందుకు ఓవైపు గీతా ఆర్ట్స్ మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఆ ఇద్దరిలో ఎవరికి ఈ సినిమా దక్కుతుందో చూడాలి.