మంచు ‘కన్నప్ప’లో ప్రభాస్‌ కీ రోల్‌!

టాలీవుడ్‌ నటుడు మంచు విష్ణు హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’ . మోహన్‌ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్‌ ఫేమ్‌ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

అత్యంత భారీ బ్జడెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. రీసెంట్‌గా మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ కూడా వదిలారు మేకర్స్‌. ఈ ఫస్ట్‌ లుక్‌లో విష్ణు జలపాతం నుంచి ఎంట్రీ ఇస్తూ.. బాణంను ఎక్కుపెట్టినట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ వైరల్‌ అవుతుండగా.. తాజాగా మూవీకి సంబంధించి ఒక సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో ఇప్పటికే మోహన్‌లాల్‌, మోహన్‌బాబు, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు భాగమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో అగ్రహీరో ఈ సినిమాలో నటించబోతున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించ నున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై మేకర్స్‌ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల న్యూజిలాండ్‌లో లాంగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇండియాకు తిరిగొచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్‌లో మొదలయ్యే తాజా షెడ్యూల్‌లో ప్రభాస్‌ జాయిన్‌ కాబోతున్నట్లు తెలిసింది.