గాసిప్స్ : ప్రపంచ వ్యాప్తంగా “కల్కి” ఇన్ని భాషల్లో విడుదల??

ఒక్క ఇండియన్ సినిమా నుంచి మాత్రమే కాకుండా తెలుగు సినిమా నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్నా సినిమా ఏదన్నా ఉంది అంటే అది ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న “కల్కి” సినిమానే అని చెప్పాలి. RRR సినిమాతో గ్లోబల్ గా తెలుగు సినిమాకి ఇండియన్ సినిమాకి భారీ రీచ్ వచ్చింది.

కాగా దీనితో ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న కల్కి కూడా వరల్డ్ క్లాస్ సినిమా కావడంతో ఈ సినిమాని కూడా ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్నాడు. అందుకే ఈ మాసివ్ ప్రాజెక్ట్ పట్ల అంచనాలు చాలా ఉన్నాయి. పైగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి బిగ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా స్కేల్ మరింత పెరింది.

కాగా ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్ గా అన్ని ముఖ్య భాషల్లో అంటే ఇంగ్లీష్ కూడా కలిపి రిలీజ్ ఉంటుంది అని ఎప్పుడు నుంచో టాక్ ఉంది. కాగా ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా 20 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇంటర్నేషనల్ గా పలు ముఖ్య భాషలు సహా ఇండియాలో కూడా దాదాపు 10 ముఖ్య భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసే సన్నాహాలు చేసున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సైన్స్ తో పాటుగా మన ఇతిహాసాలు సంబంధించి కూడా ముఖ్యమైన సీన్స్ ఉండడంతో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.