ఏప్రిల్‌ 1న గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘కల్కి’ ట్రైలర్‌

గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని 2024లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

రిలీజ్‌ డేట్‌పై రానున్నరోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది నాగ్‌ అశ్విన్‌ టీం. కాగా ఐఐటీ బాంబే 23 కాన్వొకేషన్‌ హాల్‌లో నాగ్‌ అశ్విన్‌ చిట్‌ చాట్‌లో పాల్గొన్నాడు. ఈ సెషన్‌లో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈవెంట్‌లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కల్కి ట్రైలర్‌ వచ్చేది ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు.

ఈ మూవీ ట్రైలర్‌ను 2024 ఏప్రిల్‌ 1న విడుదల చేయనున్నట్టు చెప్పాడు. అంటే ఇవాళ్టి నుంచి 93 రోజులన్నమాట. ఇంకేంటి మరి మరో మూడు నెలలు ఆగితే ట్రైలర్‌ రాబోతుందన్నమాట. ‘కల్కి 2898 ఏడీ’లో బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్‌ లాంఛ్‌ చేసిన ‘కల్కి 2898 ఏడీ’ రైడర్స్‌ (యూనిఫార్మ్‌డ్‌ విలన్‌ ఆర్మీ) కాస్ట్యూమ్స్‌ మేకింగ్‌, అసెంబ్లింగ్‌ వీడియో క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సీ అశ్వనీదత్‌ సుమారు 500 కోట్లకుపైగా బ్జడెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్‌ చేసిన టైటిల్‌, గ్లింప్స్‌ వీడియో నెట్టింట వ్యూస్‌ పంట పండిస్తున్నాయి. ఈ మూవీ డిజిటల్‌ స్టీమ్రింగ్‌ రైట్స్‌ను పాపులర్‌ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్‌ సొంతం చేసుకుంది. నెట్‌ప్లిక్స్‌ సీఈవో టెడ్‌సారండోస్‌ హీరో ప్రభాస్‌ అండ్‌ టీంతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. నెట్టింట వైరల్‌ అవుతోంది.’కల్కి 2898 ఏడీ’ హాలీవుడ్‌ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా హై టెక్నికల్‌ వాల్యూస్‌తో విజువల్స్‌ చెబుతున్నాయి.