ప్రభాస్ “కల్కి 2898AD” లో వెపన్స్ మేకింగ్ కసరత్తులు..

ఇప్పుడిప్పుడే ఇండియన్ సినిమా నుంచి పలు వరల్డ్ క్లాస్ చిత్రాలు ఓ రేంజ్ లో రావడం మొదలయ్యాయి. వి ఎఫ్ ఎక్స్ పరంగా అలాగే ఏక్షన్ పరంగా కూడా కొంతమంది స్టార్ దర్శకులు ఏదొక కొత్త రకం సబ్జెక్టుతో ట్రై చేస్తుండగా ఆ దర్శకుల్లో యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ హీరో ప్రభాస్ తో చేస్తున్న ఓ బిగ్గెస్ట్ చిత్రమే “కల్కి 2898AD” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రంని దర్శకుడు చాలా విజన్ తో ఎప్పుడు నుంచో గ్రాండ్ ప్లానింగ్ తో స్టార్ట్ చేసాడు. అయితే చిత్ర యూనిట్ అసలు ఈ సినిమా కోసం ఒక సరికొత్త లోకాన్నే సృష్టించారు. బేసిక్ గా హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ఒక సెపరేట్ యూనివర్స్ ని “కల్కి 2898AD” కోసం డిజైన్ చేశారు.

అలా ప్రతి చిన్న విషయంలో కూడా మేకర్స్ క్రేజీ డీటెయిల్స్ తీసుకొని డిజైన్ చేసారు. అలా ఈ సినిమాకి టీజర్ చూసాక కాస్త డిఫరెంట్ గా అనిపించింది అందులో ఆయుధాలు అని చెప్పాలి. సినిమాలో సైన్యం దగ్గర ఉన్న కత్తులు కానీ మెషిన్ గన్స్ కానీ చాలా ఆసక్తి రేపాయి. మరి అసలు వాటిని ఎలా తయారు చేశారు.

దాని వెనుక ఉన్న ఐడియా ఎవరిదీ? ఈ వెపన్స్ ప్రాసెస్ ఎలా చేశారు సినిమాల్లోకి ఎలా తీసుకొచ్చారో అనేది చూడాలి. ఇంకా ఈ చిత్రంలో ఉలగనయగన్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ అలాగే దీపికా పదుకొనె ఇంకా దిశా పటాని లాంటి బిగ్ స్టార్స్ నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే వచ్చే ఏడాది రిలీజ్ కి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.