ప్రభాస్ “కల్కి” టీం నుంచి అందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్..!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్న పలు భారీ చిత్రాల్లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా మాత్రం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. చాలా అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు నాగ్ అశ్విన్ అండ్ టీం ఈ సినిమా కోసం ఎంతో ఎక్కువ కస్టపడుతూ వస్తున్నారు.

అయితే ఈ సినిమా విషయంలో వచ్చిన ఫస్ట్ లుక్ కానీ టీజర్ కి కానీ వావ్ అనిపించే రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమాతో ఇండియన్ సినిమా మరో స్థాయికి వెళ్తుంది అని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. కానీ అనూహ్యంగా గత కొన్ని రోజులు కితం సినిమా నుంచి లీక్ అయ్యిన ఫోటోలు చిత్ర యూనిట్ కి షాకిచ్చింది.

దీనితో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అలా లేటెస్ట్ గా స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. దీనితో ఈ సినిమా నుంచి ఏవైనా లీకులు అయినా పోస్టర్ లేదా వీడియో ఏదైనా కూడా లీక్ చేసిన వారిని వాటిని స్ప్రెడ్ చేసిన వారి పైనా లీగల్ గా స్ట్రాంగ్ ఆక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని.

తాము ఆ సినిమా ఓనర్స్ సోషల్ మీడియాలో లీక్స్ ని ఎవరైనా స్ప్రెడ్ చేయడం జరిగితే వారంతా శిక్షార్హులు అందుకే జాగ్రత్తగా ఉండాలి అంటూ చిత్ర యూనిట్ గట్టి వార్నింగ్ ఇప్పుడు ఇచ్చారు. కాగా ఈ చిత్రంలో ఉలగనయగన్ కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ తదితర గ్రాండ్ కాస్టింగ్ నటిస్తున్నారు.
https://x.com/VyjayanthiFilms/status/1704755588582998026?s=20