ప్రభాస్ “కల్కి” ఈ విషయంలో దర్శకుడు మరింత కేర్

ఇప్పుడు మన తెలుగు హీరోస్ లో రీజనల్ నుంచి పాన్ ఇండియా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లెవెల్ చిత్రాలు చేస్తున్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఏకైక హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పాలి. కాగా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ఆ వర్ల చిత్రమే “కల్కి 2898ఎడి”.

మరి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా హాలీవుడ్ ఈవెంట్ కామిక్ కాన్ నుంచి రిలీజ్ కి వచ్చిన టీజర్ తో ఒక్కసారిగా ఇండియన్ సినిమా కోసం ప్రపంచ సినిమా మాట్లాడుకున్నట్టు అయ్యింది. ముఖ్యంగా హాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ పెట్టుకున్న ఈ చిత్రం విషయంలో అసలు దర్శకుడు ఎంత కమిట్మెంట్ గా ఉన్నాడో టీజర్ చూపించింది.

అయ్యితే ఇక్కడితో అయిపోలేదు. లేటెస్ట్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తాము రిలీజ్ చేసిన టీజర్ కి సంబంధించి ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా వి ఎఫ్ ఎక్స్ పరంగా ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయి అనేది చూస్తున్నాడట. వాటిని పరిశీలిస్తూ ఓ పాయింట్స్ ముఖ్యంగా ఉన్నాయి తాము ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకోవాలి అనే ఇతర అంశాలు అయితే తాను పునః పరిశీలన చేస్తున్నాడట.

దీనితో సినిమాలో విజువల్స్ ని మేకర్స్ మరింత బెటర్ గా మార్చే ప్లాన్ చేస్తున్నారట. తన సినిమా పట్ల ఈ రేంజ్ కేర్ తీసుకోవడం ఇంప్రెసివ్ అంశం అని చెప్పాలి. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో ఉలగనయగన్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు నటిస్తుండగా వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కాబోతుంది.