కేజీఫ్ సినిమా తో డైరక్టర్ గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ కెజీఫ్ 2 తో స్టార్ డైరక్టర్ గా పాపులర్ అయ్యాడు. దీంతో టాలీవుడ్ టాలీవుడ్ లోని స్టార్ హీరోలు ప్రశాంత్ నీలతో సినిమా చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియన్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా “సలార్”. రాధే శ్యామ్ సినిమా తర్వత ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్. అది కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజిఎఫ్ 2 సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. దీంతో ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఈ సినిమా కోసం ప్రభాస్ ఫిజిక్ మొత్తం మార్చేశాడు. కానీ ఇప్పుడు ప్రశాంత్ కి ప్రభాస్ వల్ల టెన్షన్ మొదలైనట్లు తెలుస్తొంది. సలార్ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలలో నటిస్తున్నాడు. సలార్ సినిమా షూటింగ్ పూర్తీ కాకముందే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకక్కుతున్న “ప్రాజెక్ట్ కె” తో పాటు మరొక బాలీవుడ్ సినిమా “ఆది పురుష్” లో కూడా ప్రభాస్ ఒకేసారి నటిస్తున్నాడు. దీంతో ప్రభాస్ ఇలా మూడు సినిమాలలో నటించడం వల్ల ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా డిఫరెంట్ లుక్ ఉంటుంది. అయితే సలార్ కోసం ప్రభాస్ లుక్ ను ప్రశాంత్ పూర్తిగా మార్చేశాడు. కానీ మరో రెండు సినిమాలలో నటిస్తుండటం వల్ల ఆ సినిమాకు తగ్గట్టు కూడా ప్రభాస్ లుక్ మెయింటైన్ చేస్తున్నాడు.
ఈ విషయం వల్లే ప్రశాంత నీల్ కి టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో ప్రభాస్ లుక్ చాలా ముఖ్యమైనది. అందువల్ల సినిమా మొత్తం ప్రభాస్ ఒకే ఫిజిక్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ మూడు సినిమాలలో నటిస్తుండటం వల్ల సలార్ లో ప్రభాస్ లుక్ లో చాలా తేడాలు వస్తున్నాయట. అందువల్ల ప్రశాంత్ నీల్ టెన్షన్ పడుతూ ప్రభాస్ తో ఈ విషయం ఎలా డిస్కస్ చేయాలో అర్థం కాక ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.