Prabhas : ప్రభాస్ సలార్ ఎంట్రీ సీన్ ఇలా ఉంటుందా ? ఓరి నాయనో అరాచకం అసలు ..!

ప్రభాస్ బాహుబలి సినిమాల తర్వాత పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలే కావడం విశేషం. ఇక కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా మూవీస్ డైరెక్టర్ గా మారాడు ప్రశాంత్ నీల్. కాగా ఇప్పుడుఈ పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అన్న యాక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సలార్ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. కాగా ప్రస్తుతం హైదరాబాద్ లో సలార్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ప్రభాస్ కెరీర్ లో భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న సలార్ మీద ప్రేక్షకులలో .. అన్నీ సౌత్ ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలు ఊహించని స్థాయిలో నెలకొన్నాయి. అందుకు కారణం ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మీద ముందు నుంచి ఏర్పడ్డ అంచనాలే. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ వచ్చి అంతటా హాట్ టాపిక్ గా మారింది. సలార్ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ఎంట్రీ ఇప్పటి వరకు ఏ సినిమాలో ఉండని విధంగా ఉండబోతుందట.

సాధారణంగా కమర్షియల్ సినిమాలలో హీరోల ఇంట్రడక్షన్ ఫైట్ తోనో లేదా సాంగ్ తోనో చూపిస్తుంటారు దర్శకులు. దాదాపు మన ఇండియన్ సినిమాలలో దర్శకులు ఇదే ఫాలో అవుతుంటారు. హీరోలు కూడా ఇంతకాలం ఇదే స్ట్రాటర్జీకి అలవాటు పడ్డారు. కానీ ప్రశాంత్ నీల్ ఆ పద్దతిని మార్చేస్తున్నాడట. సలార్ లో డార్లింగ్ ప్రభాస్ ఎంట్రీ మన ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. కేవలం సలార్ లో ప్రభాస్ ఎంట్రీ సీన్ కోసమే భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. క్లైమాక్స్ రేంజ్ లో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందట. అంటే ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. కాగా రీసెంట్ గా సలార్ లో ప్రభాస్ కి జంటగా శృతిహాసన్ నటిస్తున్నట్టు ప్రకటించారు.