క్రేజీ : వరల్డ్ లోనే ఈ రికార్డ్ ఉన్న ఏకైక హీరోగా ప్రభాస్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం ఆదిపురుష్ హవా నే ఇప్పుడు సినీ వర్గాల్లో నడుస్తుంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా మొన్ననే సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని అయితే మేకర్స్ అన్ని భాషల్లో రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమా ట్రైలర్ కి హిందీ లో అయితే రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. హిందీలో ప్రభాస్ పని అయ్యిపోయింది అని టాక్ ఉన్నా తన సినిమాలకి రికార్డు వ్యూస్ నమోదు అవుతున్నాయి. ఇక ఆదిపురుష్ ట్రైలర్ కి అయితే ఏకంగా 100 మిలియన్ వ్యూస్ అన్ని భాషల్లో రాబట్టింది.

అయితే ఆదిపురుష్ ట్రైలర్ 100 మిలియన్ వ్యూస్ తో ప్రభాస్ వరల్డ్ లోనే ఓ యూనిక్ రికార్డు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. బాహుబలి 2 నుంచి ఆదిపురుష్ వరకు వరుసగా నాలుగు చిత్రాలు ఆదిపురుష్, రాధే శ్యామ్, సాహూ అలాగే బాహుబలి 2 ట్రైలర్ లు వరుసగా అన్నీ కూడా 100 మిలియన్ వ్యూస్ రికార్డు మార్క్ ని అన్ని భాషల్లో కలిపి అందుకున్నాయి.

దీనితో ఈ క్రేజీ రికార్డు ఉన్న ఏకైక హీరో గా వరల్డ్ సినిమా దగ్గర అయితే ప్రభాస్ నిలిచినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో అయితే ప్రభాస్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ లాంటి రికార్డు సొంతం చేసుకున్నాడు. మరి ఈ రికార్డుని ఎవరన్నా బ్రేక్ చేస్తారా లేదా అనేది చూడాలి.