12 ఏళ్ల తర్వాత సొంతూరికి వెళ్తున్న ప్రభాస్.. పెదనాన్న కోసమే మొగల్తూరు పయనం?

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈనెల 11వ తేదీ అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించడంతో కృష్ణంరాజు గారి కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు కృష్ణంరాజు కుటుంబాన్ని కలిసి వారిని పరామర్శిస్తూ వారికి ధైర్యం చెబుతున్నారు. ఇలా తమ కుటుంబ పెద్ద చనిపోవడంతో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు విచారంలో ఉండగా ప్రభాస్ తన బాధను దిగమింగుకొని తన పెదనాన్నకు జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి జరిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే ఈయనకు సంబంధించి పలు సంతాప సభలు, సంస్కరణ పూర్తి చేశారు. అయితే కృష్ణంరాజు గారి సొంత గ్రామమైన మొగల్తూరుకి ఈనెల 28వ తేదీ ప్రభాస్ వెళ్తున్నట్టు సమాచారం.మొగల్తూరులో కృష్ణంరాజు గారి సంస్కరణ సభ సమారాధన సభను ఏర్పాటు చేయనున్నారు ఈ క్రమంలోనే రెండు రోజులపాటు ప్రభాస్ మొగల్తూరులో ఉండబోతున్నారు. ప్రభాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మొగల్తూరు వెళ్ళనున్నారు.

ఇక కృష్ణంరాజు గారి సమారాధన కోసం ఇప్పటికే మొగల్తూరులో ఉన్నటువంటి కృష్ణంరాజు ఇంటికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయని ఇప్పటికే పెయింటింగ్స్ వేయడం ఫర్నిచర్ మార్చడం వంటి పనులను మొదలు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇక కృష్ణంరాజు గారి సమారాధన రోజు 50 వేల మందికి బోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2010వ సంవత్సరంలో మరణించిన తర్వాత ఆయన మొగల్తూరుకి వెళ్లారు. అయితే 12 సంవత్సరాలకు తిరిగి ఈయన తన పెదనాన్న కోసం మొగల్తూరు వెళుతున్నట్టు తెలుస్తుంది.