Pawan kalyan : పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతోన్న ప్రభాస్ – ఇది పెర్ఫెక్ట్ ఐడియా.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలలో ఫైట్స్ ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటాయి. ఆయన చేసిన తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి సినిమాలలో ఎక్కువగా ఈ తరహా యాక్షన్ సీక్వెన్స్ నే చూశాము. పవర్ స్టార్ కి ఎంత క్రేజ్ దక్కిందంటే కొంత మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్స్ సీన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవడం వల్లే అని చెప్పుకుంటారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక్క పాన్ ఇండియన్ సినిమా చేయకపోయినా ఆ రేంజ్ క్రేజ్ ఉందంటే గొప్ప విషయం అని చెప్పాలి. అయితే ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా పవర్ స్టార్ ఫాలో అవుతున్నాడని అంటున్నారు.

ప్రభాస్ నటించిన రాధే శ్యాం ఈ సమ్మర్ లో రిలీజ్ కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి ఈ నెల 14 న టీజర్ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ టీజర్ లో పూజా హెగ్డే తన పార్ట్ కి సంబంధించిన డబ్బింగ్ ని కంప్లీట్ చేసింది. ఇక ఒకవైపు సలార్ మరొక వైపు ఆదిపురుష్ సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు ప్రభాస్. సలార్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుండగా ఆదిపురుష్ వచ్చే ఏడాది ఆగస్టు 11 న రిలీజ్ చేసేందుకు డేట్ కూడా ఇప్పటికే ఫిక్స్ చేసేశారు మేకర్స్. ఇలా పెద్ద గ్యాప్ లేకుండానే వచ్చే ఆగస్టు లోపు మూడు భారీ సినిమాలతో రాబోతున్నాడు ప్రభాస్.

Pawan kalyan : మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ – నాగ్ అశ్విన్ ..!

కాగా ప్రభాస్ నటించబోతున్న మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 50 వ సినిమా కావడం తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అని ప్రచారం అవుతోంది. కాగా ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ జిమ్నాస్టిక్స్ తెలిసినవారు కావాలని మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు జిమ్నాస్టిక్స్ డాన్స్ తెలిసిన 9-14 ఏళ్లలోపు గర్ల్స్ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన పురుషులు 20-35 ఏళ్ల మధ్య ఉండాలట. రీసెంట్ గా కాస్టింగ్ కాల్ ని ప్రకటించారు. దాంతో జిమ్నాస్టిక్స్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.