Prabhas: షూటింగ్లో గాయపడిన ప్రభాస్..ట్వీట్ వైరల్.. ఆందోళనలో అభిమానులు!

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో ఉన్నటువంటి ప్రభాస్ ఇటీవల ఓ షూటింగ్లో భాగంగా గాయపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ అండ్ టీం వెల్లడించడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కూడా ప్రభాస్ ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈయన మోకాలికి సర్జరీ కావడంతో కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు అయితే మరోసారి కూడా ఈయన గాయపడ్డారు అనే విషయం అభిమానులను కలవర పెడుతుంది. అసలు ప్రభాస్ కి ఏం జరిగింది? ప్రస్తుతం ఎలా ఉందనే విషయం గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు.

ఇకపోతే వచ్చేనెల మూడో తేదీ జపాన్లో ప్రభాస్ నటించిన కల్కి సినిమాని విడుదల చేయబోతున్నారు ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు అయితే తాను ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాలేదని ప్రభాస్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. షూటింగ్ సమయంలో తనకు కాలు బెనికిందని అందుకే వెళ్లలేకపోతున్నానని, డిస్ట్రిబ్యూటర్ల టీమ్ పాల్గొంటుందని ఆయన ప్రకటించినట్లు ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ప్రభాస్ గాయపడ్డారనే విషయం తెలిసిన అభిమానులు వెంటనే సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టుపై రిప్లై ఇస్తూ తొందరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన కల్కి 2, సలార్ 2, స్పిరిట్, రాజా సాబ్, అలాగే హను రాఘవపూడి డైరెక్షన్లో కూడా మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయ్యారు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నారు.